తెలుగు బ్లాగ్లోకానికి ఇదే మా ఆహ్వానం. ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన బ్లాగ్ కథను చదివి స్పూర్తిని పొంది ఈ బ్లాగ్ లోకంలో ప్రవేశించితిని. రానారే గారి గూగులమ్మ పదాలను చదివిన తర్వాత మరింత ఉత్సాహితుడనయ్యాను. అదే ఉత్సాహంతో నాయనమ్మ పదాలను వ్రాయాలనే ఆలోచన వచ్చింది. ఉత్సాహం తగ్గక మునుపే ఇదిగో ఆ పదాలు.....
స్వచ్చమైన చిరునవ్వుకు తరగని ఊట
నీ చేతిముద్ద అమ్రుతమట
నీ పదాలలో వ్రాయించు మంచిమాట
ఓ నాయనమ్మా....!
పొగిడితే ఎక్కు పొగడచెట్టు
తానేప్పుడు చేయు బెట్టు
నా పెళ్ళాం రీతి ఇట్టు
ఓ నాయనమ్మా ...!
పసిడి ధరలకేక్కే కైపు
స్టాక్ మార్కెట్ను వదిలే వాపు
మా మధుపులన్నయ్యే ఫ్హ్లాపు
ఓ నాయనమ్మా ...!
ఓపికతో చదివి క్షీరనీర న్యాయం చెయ్యవలిసిందిగా ప్రార్థన.
వేణు
Saturday, March 29, 2008
Subscribe to:
Posts (Atom)